జనసేనకు హైకోర్టు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ

జనసేనకు హైకోర్టు షాక్.. హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ

హైదరాబాద్‌లో జనసేన సభకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. జూన్ 2వ తేదీన నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించిన జనసేన పార్టీకి న్యాయస్థానం నుంచి నిరాశే ఎదురైంది. సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో, జనసేన నేతలు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు  తిరస్కరించింది. హైకోర్టు నుంచి అనుమతి రాకపోవడంతో, ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో జరగాల్సిన జనసేన సభ దాదాపు రద్దయినట్లేనని స్పష్టమవుతోంది.

మరోవైపు, ఒకవైపు సభ కోసం జనసేన నాయకులు, శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం ఊహించని షాక్ ఇచ్చింది. అయితే సభ రద్దయినప్పటికీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఇవాళ సాయంత్రం ఆయన తన నివాసం నుంచే నేరుగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. 

మరో వైపు తెలంగాణలో సభ పెట్టి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. ఏపీ అభివృద్ధిపై పవన్ ఫోకస్ పెట్టాలని సెటైర్లు వేస్తున్నారు.