కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసుపై గురువారం (మే14) హైకోర్టులో విచారణ జరిగింది. భగీరథ్ మధ్యంతర బెయిల్ పై రేపు(మే 15) నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ పై తీర్పును వారానికి వాయిదా వేసింది. పిటిషనర్ భగీరథ్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టులో వాదించారు. భగీరథ కేసులో పోక్సో చట్టం వర్తించదని అన్నారు.బాధితురాలి తల్లి తప్పుడు రికార్డులతో ఆమె వయసును తప్పుగా చూపించారని అన్నారు.
బాధితురాలు మైనర్ కాదు మేజర్.. బాధితురాలికి రెండు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి.. బాధితురాలిపై ఓ కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో ఓ బర్త్ డేట్.. భగీరథ్ కేసులో ఓ డేట్ ఆఫ్ బర్త్ ను చూపించారని భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. భగీరథ్ నిర్దోషి అని నిరూపించేందుకు మరిన్ని ఆధారాలున్నాయి..సీల్డ్ కవర్లో ఆ ఆధారాలను సమర్పించేందుకు అవకాశమివ్వాలని కోర్టును కోరినట్లు తెలిపారు.
►ALSO READ | ఫార్ములా-ఈ రేస్ కేసు: జులై 31న విచారణకు హాజరు కావాలి.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
ఈ కేసు అన్నీ కేసుల్లా చూడొద్దు..భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున ఆయనపైన, పోలీసులపైన వత్తిడి తేచ్చేందుకు వాల్ పోస్టర్లు, మెట్రో ట్రైన్లలో దుష్ప్రచారం చేశారు. భగీరథ్ ను దోషిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు.సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు..పోలీసులు కేసు విచారణ చేయక ముందే మీడియా ట్రయల్స్ చేసి నిందితుడిని శిక్షించే ప్రయత్నం చేస్తోంది. భగీరథ్ కు మధ్యంతర రక్షణ కల్పించాలని హైకోర్టును కోరారు.
మధ్యంతర రక్షణ కల్పిస్తే పోలీసులకు పూర్తిగా సహకరించేందుకు భగీరథ్ సిద్ధం ఉన్నాడు.. భగీరథ్ దగ్గర ఉ న్న సాక్షాలను పోలీసుల ముందు వుంచే అవకాశం కల్పించాలి.. మధ్యంతర రక్షణ కల్పించకపోతే ముందస్తు బెయిల్ పనికిరాదు..భగీరథ్ నిర్దోషి అని చెప్పుకునే అవకాశం కోల్పోతాడు..భగీరథ్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరినట్లు తెలిపారు.
