ఫార్ములా-ఈ రేస్ కేసు: జులై 31న విచారణకు హాజరు కావాలి.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

ఫార్ములా-ఈ రేస్ కేసు: జులై 31న విచారణకు హాజరు కావాలి.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

తెలంగాణలో సంచలనం రేపిన  ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి 

ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే లోతైన దర్యాప్తు జరిపి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా మాజీ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ పేర్కొంది. వీరితో పాటు ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు, ఏ5గా ఎఫ్ఈఓ (FEO) సంస్థపై కేసులు నమోదయ్యాయి.

►ALSO READ | సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు

2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసు కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు మళ్లించారన్నదే ప్రధాన అభియోగం. హెచ్ఎండీఏ ఖాతా నుంచి సుమారు 55 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ముందస్తు అనుమతులు లేకుండానే ఇంత భారీ మొత్తాన్ని విదేశీ సంస్థకు ఎలా చెల్లించారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్ సహా పలువురు ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా ఏసీబీ కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేయడంతో.. జూలై 31న కోర్టులో ఏం జరగబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.