'ఫాదర్-సన్' సెంటిమెంట్‌తో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ముగ్గురు డైరెక్టర్లు నమ్ముకున్న ఆ బలమైన ఎమోషన్ ఇదేనా?

'ఫాదర్-సన్' సెంటిమెంట్‌తో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ముగ్గురు డైరెక్టర్లు నమ్ముకున్న ఆ బలమైన ఎమోషన్ ఇదేనా?

టాలీవుడ్ యంగ్ హీరోస్ బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూడు పాన్ ఇండియా చిత్రాలపై సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాటిల్లో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి'  , రెబల్ స్టార్ ప్రభాస్ -సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్ ', యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్. ఇవి  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. 

అయితే ఈ మూడు చిత్రాల కథలు వేర్వేరు జానర్లకు సంబంధించినవే అయినప్పటికీ.. వాటన్నింటినీ కలిపే భావోద్వేగం మాత్రం ఒకటే. అదే తండ్రి- కొడుకు అనుబంధం అనే ప్రచారం సినీ వర్గల్లో జోరుగా వినిపిస్తోంది.  ఒక అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా వారణాసి తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అడవులు, ప్రాచీన నాగరికతలు, సహసయాత్రలతో పాటు తండ్రి- కొడుకు మధ్య ఉన్న భావోద్వేగ బందమే ఈ సినిమా కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని టాన్ వినిపిస్తోంది. 

మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' పోలీస్, డ్రగ్ కార్టెల్స్, మాఫియా నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ కథలో కూడా తండ్రి-కొడుకు సంబంధం కథనాన్ని కీలక మలుపు తిప్పే అంశంగా ఉంటుందని సమాచారం. వంగా తనదైన శైలిలో తీవ్ర భావోద్వేగాలను యాక్షన్‌తో మిళితం చేయనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' దేశభక్తి నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. 'కేజీఎఫ్'లో తల్లి సెంటిమెంట్,' సలార్'లో స్నేహబంధాన్ని అద్భుతంగా చూపించిన నీల్.. ఈసారి తండ్రి-కొడుకు అనుబంధాన్ని ప్రధాన భావోద్వేగంగా ఎంచుకున్నారని సినీ వర్గాల సమాచారం. అదే కథకు మరింత బలం చేకూర్చే అంశంగా మారనుందని చెబుతున్నారు.

మూడు సినిమాల నేపథ్యాలు పూర్తిగా భిన్నమైనా, వాటి భావోద్వేగ కేంద్రం మాత్రం ఒకటే అని జోరుగా చర్చ జరుగుతోంది.. యాక్షన్, భారీ విజువల్స్, పాన్ ఇండియా స్థాయి నిర్మాణ విలువలతో పాటు ప్రేక్షకుల మనసును తాకే కుటుంబ అనుబంధాలు ఉంటే సినిమాలు మరింత కాలం గుర్తుండిపోతాయి. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ ప్రచారం నిజమైతే, రాబోయే రోజుల్లో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ చిత్రాలు కేవలం యాక్షన్‌తోనే కాదు.. తండ్రి -కొడుకు అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తూ ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీవర్గాలు పేర్కొంటున్నాయి..