పిల్లలకు మాథ్స్ ఇలా కూడా నేర్పించచ్చా..? ఇక ట్యూషన్స్ టెన్షన్ ఉండదు..!

పిల్లలకు మాథ్స్ ఇలా కూడా నేర్పించచ్చా..? ఇక ట్యూషన్స్ టెన్షన్ ఉండదు..!

చాలామంది మ్యాథ్స్ అంటే భయం. కొంతమంది మిగతా సబ్జక్ట్స్ లో టాప్ మర్క్స్ సాధించి మ్యాథ్స్ లో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. మ్యాథ్స్ కోసం ప్రత్యేకంగా ట్యూషన్స్ అటెండ్ అయ్యేవారు కూడా చాలామందే ఉంటారు. అయితే... వెస్ట్ బెంగాల్ లోని ఈ స్కూల్ మాత్రం పిల్లలకు మ్యాథ్స్ ఈజీగా నేర్పించే  టెక్నిక్ ఫాలో అవుతోంది. పిల్లల్లో మ్యాథ్స్ అంటే భయం పోగొట్టే ఈ టెక్నిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ స్కూల్ ఫాలో అవుతున్న టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

వెస్ట్ బెంగాల్ లోని ధూప్‌గురిలో ఉన్న ఒక బెంగాలీ మీడియం ప్రైవేట్ స్కూల్, విద్యార్థులలోని మ్యాథ్స్ భయాన్ని పోగొట్టేందుకు ఒక వినూత్నమైన, పద్దతిని ప్రవేశపెట్టింది, టెక్స్ట్ బుక్ పరిధిని దాటి రద్దీగా ఉండే స్థానిక కూరగాయల మార్కెట్‌లోకి స్టూడెంట్స్ ని తీసుకెళ్లి మాథ్స్ పాఠాలు చెబుతోంది.

మార్కెట్... ఇంటరాక్టివ్ మ్యాథ్స్ క్లాస్ గా మారింది:

నిత్యకామలానంద శారదా శిశు మందిర్ మార్కెట్ ను ఇంటరాక్టివ్ మ్యాథ్స్ క్లాస్ గా మార్చింది, 7, 8వ తరగతులకు చెందిన 24 మంది స్టూడెంట్స్ కు ప్రాక్టికల్ గా మ్యాథ్స్ నేర్చుకునేలా దగ్గర్లోని కూరగాయల మార్కెట్‌కు తీసుకువెళ్లారు.

ప్రాక్టికల్ బడ్జెటింగ్ అసైన్‌మెంట్:

పేపర్ పై [ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు బదులుగా, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఇవ్వడం ద్వారా మ్యాథ్స్ నేర్పిస్తున్నారు టీచర్లు. ప్రతి ఒక్కరికీ రూ.50 ఇచ్చి , కేటాయించిన బడ్జెట్‌లో ఉంటూ కూరగాయలు కొనమని మార్కెట్ లోకి పంపారు. షాపింగ్ బ్యాగులు పట్టుకుని, పిల్లలు ధరలను పోల్చుతూ, వివిధ పరిమాణాల ఖర్చును లెక్కిస్తూ, కూరగాయలు కొన్న తర్వాత మిగిలిన చిల్లరను అంచనా వేస్తూ.. తమ పరిమిత బడ్జెట్ ను సమర్థవంతంగా ఎలా వాడుకోవాలో ప్లాన్ వేసుకున్నారు.

ప్రాక్టికల్ బడ్జెటింగ్ తో పెరిగిన కాన్ఫిడెన్స్:

క్లాస్ రూమ్ లో చెప్పే మ్యాథ్స్ అర్థంకాక చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడేవారని... షాపింగ్ టెక్నిక్ ద్వారా పిల్లల్లో మ్యాథ్స్ స్కిల్స్ పెరిగాయని అంటున్నారు టీచర్లు.

పేరెంట్స్ నుండి ప్రశంసలు:

ఈ ప్రోగ్రాంకు పేరెంట్స్ నుంచి ప్రసంశలు వస్తున్నాయని... పిల్లలు సొంతంగా ధరలు తెలుసుకోవడం, లెక్కలేసుకొని ఉత్సాహంగా కూరగాయలు కొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో ప్రోబ్లం సాల్వింగ్ స్కిల్స్, ఎకనామిక్ అవెర్నెస్ పెరుగుతాయని అంటున్నారు.