రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
  • విషజ్వరాల మృతుల వివరాలడిగితే మీనమేషాలు లెక్కిస్తారా ?
  • కాలయాపన వెనుక ఉద్దేశం ఏమిటి?

హైదరాబాద్‌, వెలుగు:జనం రోగాల బారినపడి మరణిస్తే వాటి వివరాలు ఇచ్చేందుకు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని రాష్ట్ర  ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది . గతంలోచెప్పిన వివరాలే మళ్లీ ఎందుకు చెబుతున్నారని,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనుసరిస్తున్న కాలయాపన వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీసింది . స్వైన్​ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలకు సంబంధించిన పిల్ విచారణలో భాగంగా కోర్టుఈ వ్యాఖ్యలు చేసింది .

‘‘ఆయా రోగాల కారణంగా మరణించిన వారి వివరాలు కోరితే గత విచారణ సమయంలోనూ ఇవ్వలే దు. ఎంతమందికి వైద్యం చేశారో,ఎంతమందికి ఆయా రోగాలు ఉన్నాయో వంటి వివరాలనే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మరణించిన రోగుల వివరాలు ఇవ్వడానికి ఉన్న అభ్యంతరమేమిటి?” అని హైకోర్టు  తాత్కాలి క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం  ప్రశ్నించింది . ప్రజారోగ్యం పట్ల  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని, తదుపరి విచారణ మే 8న చేపడతామనితెలిపింది . అప్పుడు సమగ్ర వివరాలు ఇవ్వాల్సిం దేనని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది .

స్వైన్​ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరా లకు గురైన పేదలకు సర్కారీ దవాఖానల్లో సరైన వైద్యం అందడం లేదని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మెడికల్‌ బిల్లులు దారుణంగా ఉంటున్నాయని పేర్కొంటూ లాయర్‌ రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను పిల్ గా పరిగణించి హైకోర్టు విచారణ సాగిస్తోంది . విచారణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి 22 పేజీల నివేదికను కోర్టుకు అందజేశారు. స్వైన్​ ఫ్లూనిర్ధా రణ కోసం 5574 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందులో హైదరాబాద్ కు చెందిన 606 మందికి, ఇతర చోట్ల  559 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు.

ఈ వివరాలు పరిశీలిం చిన హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది .మెడికల్‌ క్యాంపులు ఎన్ని పెట్టారు, ఎంత మంది కి మెడికల్‌ పరీక్షలు చేశారు, విష జ్వరాలు ఉన్నాయని ఎంతమంది లో నిర్ధా రణ అయింది , వైద్యం ఎందరికి అందించారు, ఎంత మంది మరణించారు.. తదితర వివరాలన్నీ ఇవ్వాలని రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది . ఈ రోగాల నివారణకు చర్యలు తీసుకునే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని ఎమికస్‌ క్యూరీ నిరంజన్‌రెడ్డి వినతిని ఆమోదించింది.