V6 News

జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఘోష్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు తీర్పు నేడు (ఏప్రిల్ 22)

జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఘోష్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు తీర్పు నేడు (ఏప్రిల్ 22)
  • కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు పిటిషన్లపై ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్​పై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్.కె. జోషి గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. అనంతరం గత మార్చి 12న తీర్పును రిజర్వ్ చేసింది. వాస్తవానికి ఈ తీర్పును ఈనెల 8నే వెలువరించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ధర్మాసనం దాన్ని ఏప్రిల్ 22కు (బుధవారం) వాయిదా వేసింది. ఈ తీర్పుతో విచారణ కమిషన్ కొనసాగుతుందా లేదా అనే దానిపై స్పష్టత రానుంది. ఇది అటు కేసీఆర్ ప్రభుత్వానికి, ఇటు ప్రస్తుత ప్రభుత్వానికి రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.