రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ సమాధానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి మూడేళ్లలో రూ.95,710.15 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాతపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల రూపంలో 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకుగానూ ఆ నిధులు ఇచ్చినట్టు చెప్పారు.
