ప్రపంచ టీ రాజధాని అని ఏప్రాంతాన్ని పిలుస్తారు.. టీ గురించి ఆసక్తికర విషయాలు!

ప్రపంచ టీ రాజధాని అని ఏప్రాంతాన్ని పిలుస్తారు.. టీ గురించి ఆసక్తికర విషయాలు!

టీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు..పొద్దున లేవగానే చాలా మందికి ఓ కప్పు టీ పడకపోతే ఆ రోజంతా  అసంపూర్ణంగా ఉంటుంది. ఘుమఘుమలాడే వేడి వేడి టీని ఓ కప్పు తాగితే వచ్చే మజా అంతాఇంతా కాదు. ఇక బయటికి వెళ్లినప్పుడు రోడ్డు పక్కన దుకాణాల్లో సువాసనలు వెదజల్లే టీ తాగి తరిస్తుంటారు కొందరు టీ ప్రేమికులు. టీపొడిని మొక్క ఆకుల నుంచి ఉత్పత్తి చేసి, వివిధ రూపాల్లో తయారు చేస్తారు. టీ సాగుకు వర్షపాతం, తేమతో సహా నిర్దిష్ట వాతావరణ పరిస్థితులు అవసరం. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు టీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఒక ప్రాంతం టీ రాజధానిగా ప్రత్యేకంగా నిలుస్తుంది. అదేంటో చూద్దాం..

ప్రపంచ టీ రాజధానిగా అస్సాం..

ఈశాన్య భారతంలోని  అస్సాం ను ప్రపంచ తేయాకు రాజధానిగా అంటే టీ రాజధానిగా పిలుస్తారు.ఇక్కడినుంచి  అధికంగా తేయాకు ఉత్పత్తి జరుగుతుంది. ఘాటైన రుచి, రంగుకు ప్రసిద్ది చెందింది. అస్సాంలోని బ్రహ్మపుత్రానది లోయలో విశాలమైన తేయాకు తోటలున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో తేయాకు సాగు కీరోల్ పోషిస్తోంది. 

ఇక ప్రపంచంలో  అతిపెద్ద టీ ఉత్పత్తిదారుగా చైనా నిలిచింది. గ్రీన్, బ్లాక్, ఊలాంగ్ వంటి రకాల తేయాకులను ఉత్పత్తి చేస్తోంది చైనా. పెద్ద ఎత్తు సాగు,  అక్కడి సాంప్రదాయ ప్రాసెసింగ్ పద్దతులు  అధిక ఉత్పత్తి  దోహపడతాయి. చైనా అనేక దేశాలకు తేయాకును ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తేయాకు పరిశ్రమలో చైనా ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా తేయాకుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.మన దేశంలో అస్సాంతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు, శ్రీలంక వంటి ప్రాంతాల్లో కూడా తేయాకు ఎక్కువగా పండిస్తారు. అధిక వర్షపాత, తేమ  వంటి  అనుకూలమైన వాతావరణం ఉండటంతో తేయాకు అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన రుచులతో విభిన్నమైన తేయాకును ఉత్పత్తి చేస్తాయి.