
ఇంటర్ రీ వెరిఫికేషన్ మార్కుల ప్రాసెసింగ్ కోసం మరో సంస్థను ఇంటర్ బోర్డు రంగంలోకి దింపింది. టీఎస్‌టీఎస్ ఆధ్వర్యంలో నోయిడాకు చెందిన డేటాటెక్ మెథడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎంపిక చేసింది. డేటాటెక్‌తోపాటు గ్లోబరినా రిజల్ట్స్ సమాంతరం ప్రాసెసింగ్ చేయనుంది. రెండు సంస్థల ఫలితాలను సరిపోల్చుకొనే బాధ్యతను సీజీజీ, జెఎన్‌టీయుహెచ్‌కు అప్పగించింది. అంతా ఒకే అనుకున్న తర్వాతే ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది విద్యాశాఖ.