హైదరాబాద్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈనెల 10లోపు విడుదల చేసేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియలు పూర్తయ్యాయి. ప్రస్తుతం తుది దశలో ఉన్న డేటా అనాలసిస్ ప్రక్రియ కొనసాగుతోంది. మే 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్, డిగ్రీ, ఇతర కోర్సుల్లో అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా త్వరగా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపు లా సెట్ ఫలితాలు
హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు గురువారం రిలీజ్ కానున్నాయి. గతనెల 18న నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 66,864 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 54,374 మంది హాజరయ్యారు.
