జల దోపిడి తో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం: నాగం

జల దోపిడి తో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం: నాగం

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్…ఏపీ సీఎం జగన్ తో లోపాయికారి ఒప్పందం చేసుకొని తెలంగాణ ద్రోహిగా మారాడని ఆరోపించారు. కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర జల దోపిడీకి పాల్పడుతుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. ఇది అసమర్థతనా, లేక కుట్రలో భాగమా… రాష్ట్ర మంత్రి వర్గం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నీళ్లు, నిధుల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ అసమర్థ సీఎం చేష్టలతో అవి ఆంధ్రాకు తరలివెళ్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ఆపాలని డిమాండ్  చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో రాష్ట్రంలోని KLI, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. జల దోపిడి తో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. పోతిరెడ్డిపాడుపై జూన్ 2 నుంచి పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు నాగం.