మున్సిపోల్స్‌‌‌‌‌‌‌‌ ప్రచారంలో రాష్ట్ర మంత్రులు బిజీ బిజీ

మున్సిపోల్స్‌‌‌‌‌‌‌‌ ప్రచారంలో రాష్ట్ర  మంత్రులు బిజీ బిజీ
  • ఇటు అసంతృప్తులకు బుజ్జగింపులు.. అటు పాత, కొత్త నేతల మధ్య సమన్వయం
  •     మరోవైపు జనాలను ఆకట్టుకునేలా ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ క్యాంపెయినింగ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, హుస్నాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రులంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిపోయారు.  ఎన్నికల ప్రచారానికి కేవలం 4 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో తమకు కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో, మరి కొందరు తమ సొంత జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రులకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలు అప్పగించారు. 

దీంతో మంత్రులు తమ సొంత జిల్లాల్లో ప్రచారం చేస్తూనే అటు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీగా ఉన్న నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపు కోసం ప్రచారం సాగిస్తున్నారు. తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో మంత్రులు పార్టీ గెలుపు కోసం త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తున్నది. ఒక వైపు తమ వారికి టికెట్ రాలేదనే అసంతృప్తితో ఉన్న నాయకులను.. మంత్రులు బుజ్జగిస్తూ వారిని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనేలా చేస్తున్నారు. 

మరో వైపు ఆయా మున్సిపాలిటీలలో పాత..కొత్త నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరిస్తూ రెండు వర్గాలను సమన్వయ పరుస్తున్నారు. అంతేకాకుండా ఈ రెండు వర్గాలను ప్రచారంలో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటూనే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇరు వర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు తమదైన శైలిలో శ్రమిస్తున్నారు. ఇంకో వైపు అభ్యర్థులను వెంటబెట్టుకొని డివిజన్లలో, వార్డుల్లో ప్రచారం సాగిస్తున్నాన్నారు. 

చాలెంజ్‌‌‌‌‌‌‌‌గా తీసుకొని..

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలను స్వయంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అప్పగించడంతో  తమ ఎన్నికలా భావించి చాలెంజ్‌‌‌‌‌‌‌‌ తీసుకొని మరీ మంత్రులంతా చెమటోడుస్తున్నారు.  గత రెండు రోజులుగా మంత్రులంతా తమ మకాంను హైదరాబాద్ నుంచి పట్టణాలకు మార్చారు.  మున్సిపాలిటీ పరిధిలో  ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు గల్లీ, గల్లీలో పాదయాత్ర చేస్తూ.. గడప, గడపకూ వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.  

మరో మంత్రి జూపల్లి కృష్ణారావు సైకిల్ తొక్కుతూ ప్రచారం కొనసాగించారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మంథనిలో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు,  ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆటో నడిపిన పొన్నం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. 6వ వార్డులో ఆటో స్టీరింగ్ పట్టి, డ్రైవ్ చేస్తూ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేస్తూ జనంతో మమేకమయ్యారు. 5, 6, 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.