హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మున్సిపల్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. వివిధ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న 91 మంది కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు స్థానచలనం కలిగింది. వీరందరిని ఏకకాలంలో ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆ శాఖ సెక్రటరీ టి.కె. శ్రీదేవి శనివారం ఉత్తర్వలు జారీ చేశారు. వీరిలో 41 మందిని వివిధ మున్సిపాలిటీలకు కమిషనర్లుగా బదిలీ చేయగా, మిగతా వారిని వివిధ కార్పొరేషన్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. మరో ఇద్దరిని మెప్మా పీడీలుగా నియమించారు. బదిలీ అయిన వారంతా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.
