ఓయూలో నేడు తెలంగాణ ఓబీసీ సింపోజియం

ఓయూలో నేడు తెలంగాణ ఓబీసీ సింపోజియం

హైదరాబాద్, వెలుగు: ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెమినార్ హాల్ లో బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ఓబీసీ సింపోజియం నిర్వహించనున్నారు. సమానత్వం, ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం మన గొంతుక, మన హక్కులు, మన భవిష్యత్తు అనే నినాదంతో ఓబీసీ వర్గాల జీవన అనుభవాలు, ఆకాంక్షలు, రాజ్యాంగ హక్కులపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

ఐసీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్ ఓయూ రీసెర్చ్ స్కాలర్ మహేశ్ గౌడ్, ఓయూకు చెందిన రమేశ్​యాదవ్, హెచ్‌‌‌‌సీయూ తెలుగు శాఖకు చెందిన డాక్టర్ శివ ముదిరాజ్, ఓయూ భౌగోళిక శాస్త్ర విభాగం విద్యార్థి అశ్వన్ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య​అతిథులుగా రిటైర్డ్‌‌‌‌ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్​మల్లన్న, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాశీం హాజరు కానున్నారు.