జులైలో అత్యధిక కరెంట్ వినియోగం..గతేడాదితో పోలిస్తే 469.38 మిలియన్ యూనిట్లు అధికం

 జులైలో అత్యధిక కరెంట్ వినియోగం..గతేడాదితో పోలిస్తే 469.38 మిలియన్ యూనిట్లు అధికం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జులైలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జులైలో 469.38 మిలియన్ యూనిట్లు ఎక్కువగా కరెంట్ వినియోగించినట్లు శనివారం విద్యుత్ శాఖ వెల్లడించింది. గతేడాది జులైలో 7,375.79 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ వినియోగం, ఈ ఏడాది జులై నాటికి 7,845.17 మిలియన్ యూనిట్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. సదరన్ డిస్కమ్  పరిధిలో జులై 25న అత్యధికంగా 10,447 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది.

గతేడాది జులై 13న ఇది 9,721 మెగావాట్లుగా మాత్రమే ఉంది. నార్తర్న్ డిస్కమ్  పరిధిలో గత నెల 25న 5,622 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా గతేడాది జులై 16న ఇది 5,197 మెగావాట్లుగా నమోదైంది.గత నెలలో వాతావరణంలో వచ్చిన మార్పులు, ఉక్కపోత కారణంగానే  డిమాండ్  పెరిగినట్లు  అధికారులు తెలిపారు.