Weather update: తెలంగాణలో అకాల వర్షాలు.. ఆందోళనలో అన్నదాతలు

Weather update:  తెలంగాణలో అకాల వర్షాలు.. ఆందోళనలో అన్నదాతలు

హైదరాబాద్​ వాతావరణశాఖ  కీలక అప్​ డేట్​ ఇచ్చింది.  ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో  తెలంగాణలో మూడు రోజుల( మే 14 నుంచి) పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ ప్రకటించింది.   తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెం జ్ అలర్ట్ జారీ చేశారు. 

సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్​ యార్డ్​ లో మంగళవారం ( మే 13) రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉరుములు... మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురడంతో పండిన ధాన్యం వర్షానికి తడిసింది.  అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం ( మే13) రాత్రిఏకధాటిగా ఓ మోస్తరు కురిసింది. 

తెలంగాణ వ్యాప్తంగా  పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.   ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో  బుధవారం ( మే 14)  తెలంగాణలోని నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగా లు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగ ల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్‌, అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు 30 నుంచి 40 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

 

 తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు  వర్షాలు కురిసే అవకాశం ఉంది. 16వ తేదీన కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.ఇక మరోవైపు చురుక్కా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మంగళవారం  ( మే 13) మధ్యాహ్నం నాటికి దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు నికోబా ర్ దీవులను తాకినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.