
ఆర్టీసీ జేఏసీ తమ ఫ్యూచర్ ప్లాన్ ప్రకటించింది. బంద్ జరిగిన మరుసటి రోజున ప్రతిపక్ష నాయకులతో చర్చించి నిరసన ప్రణాళిక ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. పోలీసులు ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యమకారులను ప్రభుత్వం భయపెట్టాలని, బెదిరించాలని చూస్తే.. తీవ్రత అంతకు రెట్టింపు అవుతుందన్నారు. తమ సమస్యపై గవర్నర్ ను కలుస్తామన్నారు. ఆర్టీసీ అధికారులు కూడా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
21 అక్టోబర్ : అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో దీక్ష
22 అక్టోబర్ : తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగాలు చేయొద్దను విజ్ఞప్తి చేస్తాం
23 అక్టోబర్ :ప్రజాప్రతినిధులను ములాఖత్ లు, మీటింగ్ లు
24 అక్టోబర్ :మహిళ కండక్టర్ల దీక్షలు
25 అక్టోబర్ : హైవేలపై బైఠాయింపు….జాతీయ రహదారులన్నీ దిగ్బంధం
26 అక్టోబర్ : ఆర్టీసీ కుటుంబాల పిల్లలతో దీక్షలు
30 అక్టోబర్ : సకల జనుల సమర భేరి పేరుతో బహిరంగ సభ.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈ ఉదయం సమావేశం అయ్యారు. ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వం తీరు, భవిష్యత్ కార్యచరణ పై చర్చించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.