Telangana Local body Elections: తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్.. రికార్డ్ శాతం పోలింగ్ నమోదు

Telangana Local body Elections: తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్.. రికార్డ్ శాతం పోలింగ్ నమోదు
  • తెలంగాణ పల్లెల్లో ముగిసిన రెండో విడత పోలింగ్
  • ఉదయం 7 గంటల నుంచే చలిని లెక్కచేయకుండా పోటెత్తిన ఓటర్లు
  • చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతం
  • ఖమ్మం జిల్లా పాలేరు నేలకొండపల్లి మండలం అనాసాగారం గ్రామంలో విషాదం
  • సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన దామళ్ళ నాగరాజు
  • బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి
  • మంచిర్యాల జిల్లా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు
  • బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉదయం 11 గంటల సమయానికి నమోదైన పోలింగ్ 56.44 శాతం
  • పెద్దపల్లి జిల్లాలోని 4 మండలాల్లో జరుగుతున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల సమయానికి 55.20 పోలింగ్ శాతం
  • అంతర్గాం  58.76 శాతం
  • ధర్మారం  51.66 శాతం
  • జూలపల్లి  58.79 శాతం
  • పాలకుర్తి  55.19 శాతం
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతం
  • ఉదయం 11 గంటల వరకు 51.14  పోలింగ్ శాతం నమోదు
  • బోయినపల్లిలో 47.97 శాతం
  • తంగలపల్లిలో 48.47 శాతం
  • ఇల్లంతకుంటలో 56.70 శాతం
  • మొత్తం లక్షా 4 వేల 905 ఓటర్లలో ఇప్పటికే 53 వేల 649 ఓటు హక్కు వినియోగం
  • ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • కాంగ్రెస్, సీపీఎం వర్గాల ఆందోళన
  • సీపీఎం కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • ఖమ్మం జిల్లా: రెండవ విడత పంచాయతీ ఎన్నికలు
  • ఉదయం 11 గంటల వరకు 64.32 పోలింగ్ శాతం
  • భద్రాద్రి: 57.57% పోలింగ్ నమోదు
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం, సాంబయ్య పల్లి గ్రామాలలో పోలింగ్ బూత్‎ల కోసం పాఠశాల తరగతి గదులు లేకపోవడంతో వరండాలో పరదాలు అడ్డుకట్టి పోలింగ్ బూత్‎లు ఏర్పాటు చేసిన అధికారులు
  • జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్, రామోజీపేట్ గ్రామాలలో పెద్దలతో పాటు పోలింగ్ బూత్‎ల దగ్గర ఎలక్షన్ క్యాంపెయిన్‎లో తమ వంతు సహకారం అందిస్తున్న పిల్లలు
  •  చిన్నప్పటి నుంచే ఎన్నికల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్న పిల్లలు 
  • కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా
  • ఝారాసంగంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు
  • కొమురం భీం జిల్లా: కౌటాల,చింతల మానేపల్లి, బెజ్జూర్,పెంచికాల్ పెట్ మండలాల్లో క్యూ లైన్లలలో బారులు తీరిన ఓటర్లు
  • ఉదయం తొమ్మిది గంటల వరకు.. కౌటాల మండలం 17.25, చింతలమానే పల్లి మండలం 21.5, బెజ్జూర్ మండలం 19.69, పెంచికాల్ పెట్ మండలం 23 శాతం పోలింగ్ నమోదు
  • రెండో విడత సర్పంచ్ ఎన్నికల లో భాగంగా నిర్మల్ గ్రామీణ మండలం ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.43 శాతం పోలింగ్
  • జగిత్యాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.45 శాతం పోలింగ్ నమోదు
  • జగిత్యాల అర్బన్ - 22.14
  • జగిత్యాల రూరల్ - 23.41
  • బీర్పూర్ - 18.31
  • సారంగాపూర్ -19.84
  • రాయికల్ -22.11
  • మల్యాల -17.19
  • కొడిమ్యాల -19.41
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలు
  • ఉదయం 9 గంటల వరకు 20.27  పోలింగ్ శాతం నమోదు
  • మొత్తం 104905 ఓటర్లలో ఇప్పటికే 21268 ఓటు హక్కు వినియోగం
  • జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 20.45 శాతం పోలింగ్ నమోదు
  • జగిత్యాల అర్బన్ - 22.14 శాతం
  • జగిత్యాల రూరల్ - 23.41 శాతం
  • బీర్పూర్ - 18.31 శాతం
  • సారంగాపూర్ -19.84 శాతం
  • రాయికల్ -22.11 శాతం
  • మల్యాల -17.19 శాతం
  • కొడిమ్యాల -19.41 శాతం
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 గంటల వరకు  పోలింగ్ పర్సంటేజ్
  • వరంగల్ జిల్లాలో 18.82%
  • ములుగు జిల్లా:  18.86%
  • హనుమకొండ జిల్లా: 19.57 %
  • జనగామ జిల్లా: 16.82 %
  • మహబూబాబాద్ జిల్లా: 23.30 %
  • భూపాలపల్లి జిల్లా: 26.40 %
  • మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని 10 మండలాలలో ప్రారంభమైన 2వ విడత  పోలింగ్
  • 282 గ్రామ పంచాయతీలలో 3,28,016 మంది ఓటర్లు, 2175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • ఇప్పటికే 38 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం , 241 సర్పంచ్ స్థానాలలో 758 అభ్యర్థులు పోటీ
  • 2418 వార్డులు ఉండగా 553 ఏకగ్రీవం ..మిగిలిన 1839 వార్డు స్థానాలలో బరిలో 4628 అభ్యర్థులు
  • మాడుగులపల్లి మండలం ఇందుగుల సర్పంచ్ స్థానానికి  హై కోర్ట్ ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోగా... వార్డు సభ్యులకు యధావిధిగా పోలింగ్
  • త్రిపురారం మండలం అభంగాపురం గ్రామంలో సర్పంచ్ ,3  వార్డులకు ST రిజర్వేషన్ రావడం.. అక్కడ ఎవరు లేకపోవడంతో వాటికి నామినేషన్ దాఖలు కాలేదు
  • (అభంగాపురం) సర్పంచ్, 3 వార్డులకు నిలిచిపోయిన  ఎన్నికలు.. మిగతా 5 వార్డులకు యధావిధిగా ఎన్నికలు
  • అనుముల మండలం పేరూరులో నామినేషన్స్ దాఖలు కాకపోవడంతో నిలిచిపోయిన పోలింగ్
  • 30 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యులు పూర్తి ఏకగ్రీవం
  • యాదాద్రి జిల్లాలో భూదాన్ పోచంపల్లి,భువనగిరి,బీబీనగర్,రామన్నపేట,వలిగొండ మండలాల్లోని గ్రామపంచాయతీల్లో రెండవ విడత ఎన్నికలు
  • 150 గ్రామపంచాయతీలకు గాను 5 గ్రామపంచాయతీలు సర్పంచ్ వార్డులు ఏకగ్రీవం,5 గ్రామపంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవం
  • 140 సర్పంచ్ స్థానాల్లో 388 అభ్యర్థులు బరిలో... 1332 వార్డులు ఉండగా 171 వార్డులు ఏకగ్రీవం..1161 వార్డులకు  పోలింగ్
  • 1161 వార్డుల్లో 2821 మంది బరిలో అభ్యర్థులు.. మొత్తం ఓటర్లు: 202716
  • కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలు
  • మొత్తం గ్రామపంచాయతీలు 120
  • 21 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం..
  • 99 గ్రామపంచాయతీలకు రెండవ విడత ఎన్నిక
  • మొత్తం వార్డులు 1114, ఏకగ్రీవం అయిన వార్డులు 232
  • మిగిలినవ 882 వార్డులకు ఎన్నిక
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభమైన గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికల పోలింగ్
  • 27 మండలాల్లోని 564 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్
  • 564 పంచాయతీల్లో 56 జీపీలు ఏకగ్రీవం
  • 508 జీపీలకు ఇవాళ ఎన్నికల పోలింగ్ 
  • బరిలో 1,686 మంది సర్పంచ్ అభ్యర్థులు
  • 4,937 వార్డులకు 917 వార్డులు ఏకగ్రీవం
  • 4020 వార్డులకు ఇవాళ ఎన్నికల పోలింగ్
  • వార్డుల బరిలో 9,884 మంది అభ్యర్థులు
  • మహబూబ్‌నగర్లో ప్రారంభమైన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
  • జిల్లా వ్యాప్తంగా రెండో విడత 565లో 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 
  • 519 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు 
  • మహబూబ్ నగర్ 9 నాగర్ కర్నూల్ 4, జోగులాంబ గద్వాల 18, వనపర్తి 5, నారాయణపేట 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
  • కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని 111 గ్రామపంచాయతీలలో ప్రారంభమైన పోలింగ్
  • మొత్తం 1046 పోలింగ్ కేంద్రాలు
  • పోలింగ్ జరగనున్న గ్రామ పంచాయతీలు: 111
  • పోలింగ్ జరగనున్న వార్డులు: 849
  • సర్పంచ్ అభ్యర్థులు: 436 మంది
  • వార్డు సభ్యుల అభ్యర్థులు: 2275 మంది
  • మొత్తం ఓటర్లు: 1,84,761 మంది
  • పోలింగ్ సిబ్బంది: 3028 మంది
  • జగిత్యాల జిల్లాలోని ఏడు మండలాల్లో ప్రారంభమైన రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్
  • జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్.. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలలో ఎన్నికలు
  • 134 సర్పంచులకు, 925 వార్డ్ సభ్యులకు జరగనున్న ఎన్నికలు
  • 521 సర్పంచ్  అభ్యర్థులు, 2624 వార్డ్ సభ్యులకు అభ్యర్థులు 
  • 1276 పోలింగ్ కేంద్రాలు..  ఏడు మండలాలో మొత్తం 2,12, 093 మంది ఓటర్లు

రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. 193 మండలాల్లోని 3 వేల 911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 38 వేల 350 పోలింగ్ ​కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. 

కొన్నింటిని మోడల్​ పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్​ ప్రక్రియను చేపట్టి.. విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.

415 సర్పంచ్​ స్థానాలు ఏకగ్రీవం.. 
రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా.. 5  పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, 8,307 వార్డు  స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్,  29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డుమెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.  

38,350 పోలింగ్​ కేంద్రాలు
సెకండ్​ ఫేజ్ ఎన్నికల కోసం 38,350 పోలింగ్​కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు మూడ్రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు.  అందని వారికి పోలింగ్ రోజు అక్కడే అందించనున్నారు. అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. వాటిపై ఎలాంటి గుర్తులు, అభ్యర్థి ఫొటోలు, పేర్లు, పార్టీ పేర్లు ఉండొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.