సెమీకండక్టర్ మిషన్-2.0లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి...కేంద్రాన్ని కోరిన మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

సెమీకండక్టర్ మిషన్-2.0లో  రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి...కేంద్రాన్ని కోరిన మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు
  •     దేశంలోనే సెమీకండక్టర్ చిప్ డిజైన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎదిగిందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎం)–2.0లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు కోరారు. దేశంలోనే సెమీకండక్టర్ చిప్ డిజైన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీలు) కేరాఫ్‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎదిగిందని, మలిదశ సెమీ కండక్టర్ తయారీ పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో ఒక జాతీయ చానల్ ఆధ్వర్యంలో ‘రైజింగ్ భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌ - సౌత్ ఎడిషన్”చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ఇన్ ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్స్, వ్యాపార సౌలభ్యం కారణంగానే జీసీసీలకు  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని చెప్పారు.

వేగంగా విస్తరిస్తున్న జీసీసీ వ్యవస్థ, అత్యున్నత టెక్నికల్ ఇండస్ట్రీలు, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్మా న్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇవ్వగల కెపాసిటీ తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ డిజైన్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రం ఎదిగిందని, చిప్ డిజైన్‌‌‌‌‌‌‌‌ రంగంలో ఇప్పటికే ప్రపంచ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని దిశానిర్దేశం చేస్తోందని తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్–2.0లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రపంచ సెమీ కండక్టర్ తయారీ రంగంలో భారత్‌‌‌‌‌‌‌‌ అగ్రస్థానానికి చేరాలనే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.