తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం పోలీసుల కవాతు, సాంస్కృతిక ప్రదర్శనల రిహార్సల్స్నిర్వహించారు. జూన్ 2న జరిగే ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా చేపట్టిన ఈ రిహార్సల్స్‌ను లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేశ్‌భగవత్‌తో పాటు మల్కాజిగిరి సీపీ సుమతి ఇతర అధికారులు వీక్షించారు.
కాగా, వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచే పరేడ్ గ్రౌండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.
-పద్మారావు నగర్, వెలుగు
