ఉద్రిక్తతకు దారితీసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె..కార్మికులకు, పోలీసుల మధ్య తోపులాట

ఉద్రిక్తతకు దారితీసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె..కార్మికులకు, పోలీసుల మధ్య తోపులాట

ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేస్తూ కార్మికులు చేపట్టిన నిరసనలతో టెన్షన్  నెలకొంది. డిపోల్లోంచి బస్సులు బయటికి రాకుండా కార్మికులు చేపట్టిన ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు, పోలీసుల మోహరింపులు, తోపులాట, అరెస్టులతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలు తెలుపుతున్న కార్మికులను పోలీసులు ఈడ్చేశారు. అరెస్టు చేసి పోలీస్​స్టేషన్లకు తరలించారు. కొన్నిచోట్ల నాన్​బెయిలబుల్​ కేసులు కూడా నమోదు చేశారు. ఈ సందర్భంగా కొందరు కార్మికులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా మహబూబ్​నగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కార్మికుల ఆందోళనలతో రోజంతా టెన్షన్​ టెన్షన్​గా గడిచింది. ఇక డ్యూటీలో చేరేందుకు వచ్చినవారిని కార్మికులు అడ్డుకుని, నిరసన వ్యక్తం చేశారు.

ముందస్తు అరెస్టులతో..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 239 మంది కార్మికులను పోలీసులు ఉదయాన్నే ముందస్తుగా అరెస్టు చేశారు. బోధన్​లో 55 మందిని, బాన్సువాడలో 36 , ఆర్మూర్ లో 15, నిజామాబాద్ లో ఒకరిని, కామారెడ్డిలో 132 మందిని అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇక ఉదయమే బోధన్‌‌‌‌ డిపో వద్దకు చేరుకున్న కార్మికులు బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్​ చేసి ఎడపల్లి, రెంజల్‌‌‌‌, బోధన్‌‌ ‌‌పోలీస్‌‌స్టేషన్లకు తరలించారు. బోధన్​ ఠాణాలో ఓ మహిళా కండక్టర్​ సొమ్మసిల్లి పడిపోవడంతో కలకలం రేగింది. నిజామాబాద్​లో ఆర్టీసీ జేఏసీ నాయకుడు సంజీవ్​ను బుధవారం తెల్లవారుజామునే అరెస్టు చేశారు. బాన్సువాడ అంబేద్కర్​ చౌరస్తా వద్ద స్టూడెంట్లు, ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేశారు. వారికి సీపీఎం నాయకులు రవీందర్, ఖలీల్, టీజీవీపీ నాయకులు కోనాల గంగారెడ్డి మద్దతుగా నిలిచారు. పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్​లో ఎక్కించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కండక్టర్​ నర్సయ్య సొమ్మసిల్లి పడిపోయారు. కామారెడ్డిలో డిపో లోపలికి కొందరు కార్మికులు చొచ్చుకెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉదయమే కార్మికులు, అఖిలపక్ష నాయకులు డిపోలకు చేరుకొని బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్‌‌ చేసి స్టేషన్‌‌కు తరలించారు. కార్మికుల అరెస్టును నిరసిస్తూ సూర్యాపేటలో నాయకులు ర్యాలీ నిర్వహించారు.

ఆర్టీసీ కార్మికులు హన్మకొండ అశోకా జంక్షన్​లో కేసీఆర్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్​కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్​లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా కండక్టర్​ శ్రీలత స్పృహ కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. నర్సంపేట డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఆదిలాబాద్​ జిల్లా నిర్మల్‍ డిపో పరిధిలో నలుగురు కార్మికులు, ఆసిఫాబాద్‍ డిపో పరిధిలో ఒకరు విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించగా.. జేఏసీ నేతలు, కార్మికులు వారికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆసిఫాబాద్‍  డిపో వద్ద కార్మికులు రిలేదీక్షలు చేపట్టగా.. నిర్మల్‍, ఆదిలాబాద్‍, మంచిర్యాల, భైంసా, ఉట్నూర్‍ డిపోల ఎదుట కార్మికులు ర్యాలీలు చేపట్టారు. సీఎం హెచ్చరికతో డ్యూటీలో చేరుతామన్న ముగ్గురు కార్మికులు.. తిరిగి సమ్మెలో చేరారు.

కరీంనగర్–2 డిపో ఎదుట కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఉద్యోగంలో చేరిన 24 మందిని కార్మిక ద్రోహులంటూ నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు కరీంనగర్–1 డిపో ఎదుట ధర్నా చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.