నారాయణగూడ, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. గురువారం హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీవో 8, 9 ప్రతులను చించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జీవోలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘం నాయకులు ఉదయనేత, శివకుమార్, వినయ్, రాంబోల్ నాయక్, ప్రవీణ్, హరీశ్ పాల్గొన్నారు.
