మల్టీ పర్పస్ వర్కర్లకు సేఫ్టీ కిట్లు..జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంపిణీ 

మల్టీ పర్పస్ వర్కర్లకు సేఫ్టీ కిట్లు..జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంపిణీ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులుగా సేవలందిస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల (ఎంపీడబ్ల్యూ) భద్రతకు పెద్దపీట వేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇందులోభాగంగా మల్టీ పర్పస్ వర్కర్ల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా వారికి ‘సేఫ్టీ కిట్లు’ పంపిణీ చేయనున్నది.

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రామ సభల్లో  ఈ కిట్లను అందజేయనున్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న వర్కర్లకు గ్లౌజులు, మాస్కులు, బూట్లు వంటి రక్షణ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు