ప్రతి ఉమ్మడి జిల్లాకో అగ్రికల్చర్ కాలేజీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రతి ఉమ్మడి జిల్లాకో అగ్రికల్చర్ కాలేజీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, వెలుగు : ప్రతి ఉమ్మడి జిల్లాకో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్​వర్సిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో అగ్రికల్చర్​ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.  

రాష్ట్రంలో వ్యవసాయ విద్యను విస్తరించి, రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నిజామాబాద్​లో  అగ్రికల్చర్ కాలేజీకి సీఎం రేవంత్  శుక్రవారం శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు.