ఫిష్ క్యాంటీన్ల సేవలు మరింత విస్తరించాలి : మంత్రి వాకిటి శ్రీహరి

ఫిష్ క్యాంటీన్ల సేవలు మరింత విస్తరించాలి : మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫిష్ క్యాంటీన్ల సేవలను మరింత విస్తరించాలని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మాసబ్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లోని ఫిషరీస్ హెడ్‌‌‌‌ ఆఫీసును, అక్కడ నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్‌‌‌‌ను ఆయన సందర్శించారు. క్యాంటీన్‌‌‌‌లో వినియోగదారులకు అందిస్తున్న సేవలను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అందుబాటులో ఉన్న చేపల వంటకాలు, మెనూ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

క్యాంటీన్‌‌‌‌ను ఆధునిక సౌకర్యాలతో మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.  చేపలు అధిక ప్రోటీన్లు, పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారమన్నారు. ప్రజలకు నాణ్యమైన చేపల ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పరిశుభ్రంగా, రుచికరంగా ఆహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల, అదనపు డైరెక్టర్ మురళీకృష్ణతో పాటు శాఖ అధికారులు పాల్గొన్నారు.