జూన్ 12 దాకా గ్రామసభలు..మహిళా సంఘాలకే పంట ఉత్పత్తుల సేకరణ బాధ్యత: సీఎం రేవంత్

జూన్ 12 దాకా గ్రామసభలు..మహిళా సంఘాలకే పంట ఉత్పత్తుల సేకరణ బాధ్యత: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: జూన్12వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. 99 డేస్​ యాక్షన్ పాన్​లో భాగంగా.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి గ్రామ సభలు ఉంటాయని వివరించారు. మహిళాలను కోటిశ్వరులుగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే పంట ఉత్పత్తులను సేకరించడం, గోడౌన్లను నిర్మించడం, రైస్​మిల్లులకు అప్పగించడం, ఆ తరువాత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ప్రొడక్ట్​లను తీసుకురావడం వంటి అన్ని బాధ్యతలను మహిళా స్వయం సంఘాలకు అప్పగించేలా  ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.