హైదరాబాద్: వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. రానున్న రెండు మూడు గంటల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీచే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి ఒకటి మరాత్వాడ ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. దీంతో బుధవారం 23 జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. గురువారం (రేపు) 19 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అలెర్ట్స్ ప్రకటించింది.
బుధవారం(ఈరోజు) అదిలాబాద్, కొమరం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
►ALSO READ | ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్.. పిలుపునిచ్చిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్
ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగుపాటు సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
