షోరూంలోనే కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లు : జేటీసీ చంద్ర శేఖర్ గౌడ్ 

షోరూంలోనే కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లు : జేటీసీ చంద్ర శేఖర్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ వెహికిల్స్  పర్మినెంట్ రిజిస్ట్రేషన్లను వాహన షోరూంలలోనే పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘వాహన్’లో వ్యక్తిగత వెహికిల్స్ అయిన కార్లు, టూ వీలర్స్ ​పర్మినెంట్ రిజిస్ట్రేషన్లను మాత్రమే షోరూంలలో చేస్తున్నారు. ఇదే యాప్ లో కమర్షియల్ వెహికిల్స్ అయిన లారీలు, బస్సులు, ఆటోల పర్మనెంట్ రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేసేందుకు రవాణా శాఖ చర్యలు తీసుకుంటున్నది.

మరో వారం, పది రోజుల్లో మొదటి దశలో ఈ ప్రక్రియను ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ పరిధిలోని షోరూంలలో ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ చెప్పారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలుచేయనున్నట్టు తెలిపారు.