ఎన్నికల నోటిఫికేషన్ లు తప్ప.. ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఏవీ? : తెలంగాణ నిరుద్యోగ జేఏసీ

ఎన్నికల నోటిఫికేషన్ లు తప్ప.. ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఏవీ? : తెలంగాణ నిరుద్యోగ జేఏసీ
  •     తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రశ్న

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏవని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రశ్నించింది. రాజకీయ నిరుద్యోగులపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. నిరుద్యోగం పెరగడానికి నోటిఫికేషన్లు లేకపోవడమే ప్రధాన కారణమని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేసింది.  

జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్​లో ‘హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్’ పేరిట మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ విట్టల్, అశోక్, ప్రసన్న, హేమా జిల్లోజు, గుజ్జ కృష్ణ హాజరై మాట్లాడారు.