హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీతోపాటు కొత్తగా ఏర్పడిన సీఎంసీ(సైబరాబాద్మున్సిపల్కార్పొరేషన్), ఎంఎంసీ(మల్కాజిగిరి మున్సిపల్కార్పొరేషన్)లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త లోగోలు రూపొందించింది. సోమవారం మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త లోగోలను సంబంధిత కమిషనర్లతో కలిసి ఆవిష్కరించారు.
జీహెచ్ఎంసీకి ఇదివరకు లోగో ఉన్నప్పటికీ మూడు కార్పొరేషన్లకు ఒకేవిధంగా ఉండేలా రూపొందించారు. సీఎంసీ. ఎంఎంసీలు ఏర్పడిన 6 నెలల తర్వాత లోగోలు ఫైనల్ అయ్యాయి. ఇకపై అధికారికంగా వీటినే వాడనున్నారు.
