త్యాగాలు ఉద్యమకారులు చేస్తే.. బోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నరు

త్యాగాలు ఉద్యమకారులు చేస్తే.. బోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నరు

త్యాగాలు ఉద్యమకారులు చేస్తే.. బోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ విద్యార్థి మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ దాత్రిక స్వప్న. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఉద్యమ కారిణిలకు సరైన గుర్తింపు లేదని స్వప్న అన్నారు. మే 2వ తేదీ మంగళవారం దాత్రిక స్వప్న ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద మహిళా ఉద్యమకారులతో కలిసి తెలంగాణ (బీఆర్ఎస్) ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన దాత్రిక స్వప్న.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆనాటి ఉద్యమనేత కేసీఆర్ పిలుపు మేరకు పురుషులతో సమానంగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించామని.. సాధించిన తెలంగాణలో మహిళ ఉద్యమకారులకు స్థానం లేకపోవడం బాధాకరమన్నారు. నేడు (బీఆర్ఎస్) చట్టా సభలో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని పోరాడుతుంటే.. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు.. మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు స్వప్న.