వరల్డ్‌‌‌‌‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో సుమిత్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్​

వరల్డ్‌‌‌‌‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో సుమిత్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్​

కోబె (జపాన్‌‌‌‌‌‌‌‌): వరల్డ్‌‌‌‌‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు మరో మూడు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ లభించాయి. డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ సుమిత్‌‌‌‌‌‌‌‌ అంటిల్‌‌‌‌‌‌‌‌.. మెన్స్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌ 64 జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రోలో స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో సుమిత్‌‌‌‌‌‌‌‌ ఈటెను 69.50 మీటర్ల దూరం విసిరి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఇండియాకే చెందిన సందీప్‌‌‌‌‌‌‌‌ (60.41 మీ), దులాన్‌‌‌‌‌‌‌‌ కొడితువాక్కు (66.49 మీ, శ్రీలంక) బ్రాంజ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ను సాధించారు. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ టీ63 హైజంప్‌‌‌‌‌‌‌‌లో తంగవేలు మరియప్పన్‌‌‌‌‌‌‌‌ 1.88 మీటర్ల దూరం దూకి స్వర్ణం గెలిచాడు. ఎనిమిదేళ్ల తర్వాత అతనికి ఇది తొలి గోల్డ్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. అమెరికా అథ్లెట్లు ఎజ్రా ఫ్రెచ్‌‌‌‌‌‌‌‌ (1.85 మీ.), సామ్‌‌‌‌‌‌‌‌ గ్రీవ్యూ (1.82 మీ.) వరుసగా సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌ 51 క్లబ్‌‌‌‌‌‌‌‌ త్రోలో ఏక్తా భయాన్‌‌‌‌‌‌‌‌ 20.12 మీటర్ల దూరంతో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఇండియా 10 పతకాల (4 గోల్డ్‌‌‌‌‌‌‌‌, 4 సిల్వర్‌‌‌‌‌‌‌‌, 2 బ్రాంజ్‌‌‌‌‌‌‌‌)తో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది.