13నెలల్లో 30 వేల సెల్‌‌ఫోన్స్‌‌ రికవరీ : మహేశ్ భగవత్

13నెలల్లో 30 వేల సెల్‌‌ఫోన్స్‌‌ రికవరీ : మహేశ్ భగవత్
  •  మొబైల్స్ ట్రేస్​లో తెలంగాణకు దేశంలోనే రెండవ స్థానం

హైదరాబాద్‌‌, వెలుగు: దొంగతనానికి గురైన ఫోన్లను రికవరీ చేయటంలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు.సెంట్రల్ ఎక్విప్‌‌మెంట్‌‌ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్‌‌‌‌) పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి గత 13 నెలల్లో 30,049 సెల్‌‌ ఫోన్స్‌‌ రికవరీ చేశారు. గతేడాది ఏప్రిల్‌‌ 19 నుంచి మంగళవారం వరకు రికవరీ చేసిన సెల్‌‌ ఫోన్స్‌‌ వివరాలను అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్స్‌‌లో సీఈఐఆర్‌‌‌‌ పోర్టల్‌‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. గత 9 రోజుల వ్యవధిలో వెయ్యి ఫోన్లను బ్లాక్ చేసి రికవరీ చేశామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3078, రాచకొండ 3042, వరంగల్‌‌ 1919, నిజామాబాద్‌‌లో 1556 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించామని అధికారులు పేర్కొన్నారు.