
‘‘వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు.. ఇప్పటి వరకు నేను కచ్చితంగా వాడిని కలవలేదు.. ఏరోజు నేను కలుస్తానో అదే వాడికి అఖరి రోజు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఇంతకీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవరికి? ఎందుకోసం.. ఎవరినీ ఆమె వెతుకుతుంది? అనే వివరాలు తెలియాలంటే ‘రక్షణ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
పాయల్ ఫిమేల్ లీడ్‌గా ఈ చిత్రం నుంచి మంగళవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. అందులోని డైలాగే ఇది. ఇందులో ఆమె పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఓ హంతకుడు క్రూరంగా హత్యలు చేస్తుంటాడు.. అతనెవరో కనిపెట్టి అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన పాయల్ రాజ్‌పుత్ ప్రయత్నిస్తుంటుంది. ఇందులో రోషన్, మానస్ కీలక పాత్రల్లో నటించారు. ప్రణదీప్ ఠాకూర్ దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.