బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి, రెండింటిని టై చేసుకుంది. దీంతో 10 పాయింట్లతో టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. తాజాగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్ 38–48తో యు ముంబా చేతిలో ఓడింది. ముంబా టీమ్ తరఫున అభిషేక్ సింగ్ (13), అజిత్ (8) కీ రోల్ పోషించారు. రింకూ (7), హరేంద్ర కుమార్ (4) అండగా నిలిచారు. తెలుగు టైటాన్స్ టీమ్‌లో రాకేశ్ (7), అంకిత్ (6), రుతురాజ్ (4) మెరుగ్గా ఆడినా విక్టరీని అందించలేకపోయారు. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ 37–33తో యూపీ యోధాపై గెలిచింది. నవీన్ కుమార్ 18 పాయింట్లతో ఢిల్లీ జట్టుకు అండగా నిలిచాడు. విజయ్ (7) ఫర్వాలేదనిపించారు. యూపీ టీమ్‌లో పర్దీప్ నర్వాల్ (9), సురేందర్ గిల్ (9) రాణించినా ప్రయోజనం లేకపోయింది.

