హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 6, 7 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ వనజ తెలిపారు. రెగ్యులర్‌తో పాటు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల్లోని ఖాళీ సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్లు, ఇతర ఒరిజినల్ ధ్రువపత్రాలతో సంబంధిత విభాగాల్లో నేరుగా హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
