Temba Bavuma: పొట్టోడు కాదు.. గట్టోడు.: డీజే అవతారమెత్తిన బవుమా

Temba Bavuma: పొట్టోడు కాదు.. గట్టోడు.: డీజే అవతారమెత్తిన బవుమా

టెంబా బావూమా.. ఈ పేరు వినగానే నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటారు. పొట్టిగా ఉండటం..కెప్టెన్ గా విఫలమవడం వలన ట్రోల్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. దీనికి తోడు ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవడంతో బావుమాపై సెటైర్ల వర్షం కురిసింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఒక టాలెంట్ తో ఆకట్టుకున్నాడు. డీజే వాయిస్తూ తనలోని ఎవరికీ తెలియని టాలెంట్ ను అందరికీ పరిచయం చేశాడు.

శనివారం (ఫిబ్రవరి 10) సౌతాఫ్రికా లీగ్ టీ20 టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో డర్బన్ సూపర్ జయింట్స్ పై 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత సహచర ప్లేయర్లకు (సన్ రైజర్స్) డీజే వాయిస్తూ కిక్ ఇచ్చాడు. DJ టోపీని ధరించి,ఫేమస్ ట్యూన్‌లను స్పిన్ చేస్తూ ఆశ్చర్యపరిచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతుంది. సన్ రైజర్స్ జట్టులో ఈ సీజన్ లో గాయం కారణంగా బావుమా ప్లే ఆఫ్ మ్యాచ్ తో పాటు, ఫైనల్ ఆడలేదు. 

ఈ టోర్నీలో బావుమా తన చివరి మ్యాచ్ ను ఫిబ్రవరి 4 న ఆడాడు. సెయింట్ జార్జ్ పార్క్ లోని గ్కెబెర్హాలో పార్ల్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో బావుమా 30 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడ్డ ఈ దక్షిణాఫ్రికా కెప్టెన్.. రెండో టెస్ట్ తో పాటు ప్రస్తుతం న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు.