సజ్జనార్ పై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

సజ్జనార్ పై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ను ఉద్దేశించి  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఏమైనా సజ్జనార్ అయ్య జాగీరా అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.రెండేళ్లలో రిటైర్డ్ అయి పోతాను అనుకుంటున్నావు సజ్జనార్.. సప్త సముద్రాల వెనక ఉన్నా పట్టుకొచ్చి తాట తీస్తామంటూ బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది. 

గురువారం  సెప్టెంబర్ 24) తెలంగాణ భవన్ లో ప్రెస్  మీట్ లో మాట్లాడిన  కౌశిక్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ చేశారు. గణేష్ నిమజ్జనం యాత్ర సందర్భంగా యువత కేసీఆర్ పాటలు పెట్టుకుంటే కేసులు పెడతామని సజ్జనార్ యువతను బెదిరిస్తున్నారని.. సజ్జనార్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణు సజ్జనార్ అయ్య జాగీర్ కాదు.. రెండేళ్లలో రిటైర్డ్ అయిపోతాను.. నన్నేం ఎవరేం చేస్తారులే అని అనుకుంటున్నావేమో.. సప్త సముద్రాల వెనక దాగి వున్నా తీసుకొచ్చి తాట తీస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపులకు దిగడం రాజకీయ వర్గాల్లో  తీవచర్చకు దారి తీసింది.