విజయ్ తనయుడి 'సిగ్మా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి.. సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబోపై భారీ అంచనాలు!

విజయ్ తనయుడి 'సిగ్మా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి.. సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబోపై భారీ అంచనాలు!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబోలో వస్తున్న చిత్రం 'సిగ్మా' (Sigma) . భారీ అంచనాల మధ్య ఈ మూవీ అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సర్వం సిద్ధమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెడుతున్న తొలి మూవీ ఇది. దీంతో ఆరంభం నుంచే ఈ ప్రాజెక్ట్‌పై సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది.

లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌లో యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. టాలీవుడ్ భామ ఫరియా అబ్దుల్లా కథానాయికగా అలరించనుండగా.. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ. 500 కోట్ల నేపథ్యంలో సాగే మైండ్ గేమ్‌లు, హై-స్టేక్స్ గ్యాంబ్లింగ్, ఊపిరి బిగపట్టే ఛేజింగ్ సీన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఎస్. థమన్ అందిస్తున్న మాస్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకోవడంతో వ్యాపార వర్గాల్లో దీనిపై విపరీతమైన బిజినెస్ బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మేకర్స్ గ్రాండ్ ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ (Park Hyatt) హోటల్‌లో రేపు ( సెప్టెంబర్ 25, 2026 ) సాయంత్రం 6 గంటల నుంచి 'సిగ్మా' ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత వైభవంగా జరగనుంది.

ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నెలకొంది.  దళపతి విజయ్ కుమారుడి డెబ్యూ మూవీ వేడుకలో మెగాస్టార్ ముఖ్య అతిథిగా పాల్గొంటుండటంతో ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది.. ఈ వేదికపై చిరంజీవి చెప్పబోయే మాటలు, సందీప్ కిషన్‌తో ఆయనకున్న అనుబంధం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనున్నాయి. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ హీస్ట్ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.