ఆదిలాబాద్ జిల్లాలో ఆర్ఎస్సై పై హత్యాయత్నం కలకలం రేపింది. 2026 సెప్టెంబర్ 24న ఆర్ఎస్సైని కారుతో ఢీకొట్టి చంపబోయాడు ఆర్ఐ. హత్యయత్నం వార్త పోలీసు శాఖను చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడ బెటాలియన్ లో పోలీసుల మద్య విభేదాలు ముదిరాయి. ఆర్ఎస్సై అర్ ఎస్సై రాకేష్ పై ఆర్ఐ నరేష్ హత్యయత్నానికి పాల్పడ్డాడు. బైక్ పై వెళ్తున్న ఆర్ఎస్సై రాకేష్ ను ఆర్ఐ నరేష్ కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు.
తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను చికిత్స కోసం అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్యయత్నంపై విచారణ జరుపుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
