వానాకాలంలో మండుతున్న ఎండలు..30 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు

వానాకాలంలో మండుతున్న ఎండలు..30 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలతో చల్లబడాల్సిన వాతావరణం అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వానాకాలంలో ఈ పరిస్థితి ఏంటని ప్రజలు వాపోతున్నారు. వారం రోజులుగా సిటీలో 30 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

ఈ నెల 7వ తేదీన 31 డిగ్రీలు, 8, 9, 10 తేదీల్లో  32  డిగ్రీలు, 11, 12 తేదీల్లో 33 డిగ్రీలు,13న 34 డిగ్రీలు నమోదు కాగా, 14న సోమవారం 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగురోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అయితే, రాష్ట్రంలో జులై 16 నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.