లాక్ డౌన్ ఎత్తేస్తే మరణాలు పెరుగుతాయ్ : రాకెట్ లాంచర్లు, గన్స్ తో నిరసనలు

లాక్ డౌన్ ఎత్తేస్తే మరణాలు పెరుగుతాయ్ : రాకెట్ లాంచర్లు, గన్స్ తో నిరసనలు

అమెరికా ఆర్ధిక వ్యవస్థను గాడిలోకి పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ధిక సమస్యల నుంచి భయట పడాలంటే దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తేయడే మార్గమని భావించిన ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  తొలత 12 పైగా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తే దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. ఆ నిర్ణయం పై  అమెరికాలో లాక్ డౌన్ ను ఇప్పుడే ఎత్తేస్తే కరోనా మరణాలు పెరుగుతాయని, ఎకానమీ దెబ్బతింటుందని వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ అంథోనీ ఫౌచీ హెచ్చరించారు. మరీ తొందరగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఇటలీ పోయిన వారం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో… అక్కడ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయన్న ఫౌచీ.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రజలు బయటకు రావడం ప్రారంభమైతే కేసుల సంఖ్య పెరిగిపోతుందని ఫౌచీ అన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా మరీ తొందరగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తే పరిస్థితి మరింత సీరియస్ గా మారుతుందని హెచ్చరించారు.

మరో వైపు ఫౌచీ అభిప్రాయాన్ని సమర్థిస్తూ..ట్రంప్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు నిరసన బాటపట్టారు. ఆ నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిరసన చేస్తున్న వారిలో  రాకెట్ లాంచర్లు, గన్స్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.