టెన్ట్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్ట్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
  • టెన్త్ పరీక్షలు: ఉదయం 9.30 నుంచి 12.45 వరకు
  • ఇంటర్ ఫస్టియర్: ఉదయం 9 నుంచి 12 వరకు
  • ఇంటర్ సెకండియర్: మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10 వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 దాకా జరగనున్నాయి. 55,662 మంది స్టూడెంట్లు హాజరు కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. పరీక్షకు రెండ్రోజుల ముందు www.bse.telangana.gov.in నుంచి హాల్​టికెట్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

ఇంటర్​ పరీక్షలకు 3.48 లక్షల మంది

ఇంటర్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమై ఈ నెల 10 వరకు జరగనున్నాయి. 3,48,171 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ఫస్టియర్‌‌‌‌‌‌‌‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్ జరగనున్నాయి. సప్లిమెంటరీకి 1,34,329 మంది, ఫస్టియర్ ఇంప్రూవ్​మెంట్ కోసం 99,667 మంది పరీక్షలు రాయబోతున్నారు. సెకండియర్ స్టూడెంట్లు సప్లిమెంటరీ కోసం 1,13,267 మంది, బెటర్​మెంట్ కోసం 15 మంది రాయనున్నారు. లాంగ్వేజీలు, అటెండెన్స్ మినహాయింపు స్టూడెంట్లు 897 మంది హాజరు కానున్నారు.