టెన్త్ క్లాస్ డైరీస్' నా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది : అవికా గోర్

టెన్త్ క్లాస్ డైరీస్' నా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది : అవికా గోర్

శ్రీరామ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ మైసూర్ సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూలై 1న టెన్త్ క్లాస్ డైరీస్ రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరోయిన్ అవికా గోర్‌ ఇంటర్వ్యూ..

హాయ్ అవికా గోర్! ఎలా ఉన్నారు?
అవికా గోర్: ఐయామ్ గుడ్. చాలా బాగున్నాను. త్వరలో 'టెన్త్ క్లాస్ డైరీస్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. 

'టెన్త్ క్లాస్ డైరీస్' గురించి చెప్పండి... సినిమా ఎలా ఉండబోతోంది?
అవికా గోర్: ఇదొక స్వీట్ మూవీ. టెన్త్ క్లాస్ మేట్స్ అందరూ రీ యూనియన్ అయితే ఎలా ఉంటుందనేది చూపించారు. రీ యూనియన్ ఒక్కటే కాదు.. సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది. ఇంకా ఇందులో కొంచెం డ్రామా, ఫ్లాష్‌ బ్యాక్‌, కామెడీ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా వినోదాత్మకంగా దర్శకుడు అంజి తెరకెక్కించారు. నేను ఎంపిక చేసుకునే కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ కథను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకన్నా డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. 

టెన్త్ క్లాస్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి?
అవికా గోర్: సినిమా షూటింగ్స్! ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ.. మరో వైపు షూటింగ్స్ చేశా. నేను స్కూల్‌కు వెళ్ళింది తక్కువ. లొకేషన్స్‌లో, సెట్స్‌లో ఉన్నది ఎక్కువ. 

మీ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయా? ఒక్కటేనా?
అవికా గోర్: ఐ డోంట్ నో! నాకు తెలియదు. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి (నవ్వులు). సినిమా నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అందులో చాలా సస్పెన్స్ ఉంది. సినిమాలో నా పాత్ర పేరు చాందిని. ఆమె ఎక్కడ ఉంది? చాందిని ఏం చేస్తుంది? బతికుందా? లేదా? అని తెలుసుకోవాలని క్లాస్‌మేట్స్‌ ప్రయత్నిస్తారు. చాలా సస్పెన్స్ అన్నమాట. 

నిర్మాతలు అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ గురించి చెప్పండి..
అవికా గోర్: వెరీ నైస్ పీపుల్. వాళ్ళ నిర్మాణంలో కంఫ‌ర్ట్‌బుల్‌గా ఫీలయ్యాను. మేం చాలా లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు.  చిక్ మంగుళూరు, రాజమండ్రి, శ్రీలంక ఇలా చాలా లొకేషన్స్‌లో చేశారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంత మందితో సినిమా తీయడం ఎంత కష్టమో నిర్మాతగా నాకు తెలుసు. 

మీ మీద ఒక పాట తెరకెక్కించారు. సినిమాలో పాటల గురించి...
అవికా గోర్: ఏ సినిమాకు అయినా సరే పాటలు చాలా ముఖ్యం. ఎంతో వాల్యూ యాడ్ చేస్తాయి. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఆల్రెడీ ప్రేక్షకులకు నచ్చాయి. నార్త్ ఇండియాలో నా ఫ్రెండ్స్ కూడా 'టెన్త్ క్లాస్ డైరీస్' పాటలు వింటున్నారు. హార్ట్ టచింగ్ సాంగ్స్ అని అంటున్నారు. 

హీరో శ్రీరామ్ గురించి...
అవికా గోర్: అమేజింగ్ యాక్టర్. మా మధ్య ఎక్కువ సీన్స్ లేవు. అయితే... ఆయనతో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. ఆయన ఎక్స్‌పీరియ‌న్స్‌లు చెప్పారు. 

ఎవరితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి?
అవికా గోర్: నా తండ్రి పాత్రలో నాజర్ నటించారు. ఆయనతో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. సినిమాపై ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఎంతో నేర్చుకున్నాను. 

దర్శకుడు అంజి గురించి చెప్పండి?
అవికా గోర్: అంజి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో బాగా తెలుసు. సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా బాగా తీశారు.

మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మిళింద్‌తో మీరు ప్రేమలో ఉన్న విషయం తెలుసు. ఆయన పరిచయం తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి?
అవికా గోర్: నేను మరింత కాన్ఫిడెంట్‌గా మారాను. నా కేపబిలిటీ ఏంటనేది నాకు తెలిసింది. నేను ఏం చేయగలనో తెలిసింది. నేను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలనని తెలుసుకునేలా చేశాడు. నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ.. నా ప్రతి అడుగులో మిళింద్ ఉన్నాడు. నా ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డాడు. అతడు లేకుండా నేను ఇదంతా చేయలేను.

తెలుగు సినిమాలకు మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏదో ఉందని రూమర్స్ వచ్చాయి. మీరేమంటారు?
అవికా గోర్: నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోయా. అంతకు మించి ఏమీ లేదు. డేట్స్ లేక తెలుగు సినిమాలు చేయలేయకపోయా. 

జూన్ 30న మీ పుట్టినరోజు. బర్త్ డే ప్లానింగ్స్ ఏంటి?
అవికా గోర్: ప్రస్తుతానికి ఏమీ లేవు. జూలై 1న 'టెన్త్ క్లాస్ డైరీస్' విడుదలవుతోంది కదా! వీలైతే ఒక్క రోజు ముందు... నా పుట్టిన రోజున అది చూడాలనుకుంటున్నా. వచ్చే నెలలో నేను నటించిన 'థాంక్యూ' విడుదల కానుంది. ఇంకా తెలుగులో సినిమా చేస్తున్నాను. ఆ సినిమా గురించి మీకు చెప్పాలనుంది. పుట్టినరోజున అప్‌డేట్స్‌ రావచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్!