ఆధ్యాత్మికం : ఈ వాటిక శివుడు తన పిశాచ అనుచరగణంతో నాట్యమాడు రంగ స్థలం..

ఆధ్యాత్మికం : ఈ వాటిక శివుడు తన పిశాచ అనుచరగణంతో నాట్యమాడు రంగ స్థలం..

సుఖాన్ని ఆశించి మనుషులు కోరికల వెంట పరుగులు తీస్తారు. ఇంద్రియాలకు బానిసలై ... ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. చివరికి మిగిలేదేమిటీ? దానివల్ల శరీరం రోగాలతో నిండిపోతుంది. మనసుకు శాంతి లేకుండా పోతుంది. చివరకు దుఃఖమే మిగిలిపోతుంది. ఈ లోకంలో మనుషులకు మరణమే చివరకు శరణమైనా... ఆశపాశంలో చిక్కుకోకుండా జ్ఞానంతో నడుచుకోలేకపోతున్నారు!

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము. నిప్పులలోనే కరిగిపోయె
 ఇచ్చోటనే భూములేలు రాజమ్మముల యధికారముద్రిక అంతరించే
 ఇచ్చోటనే  లేత ఇల్లాలి వల్లపూసలపారు గంగలో కలిసిపోయే 
ఇచ్చోటనే వెట్టి పేరెన్నిక గన్న చిత్రలేఖకుని ముంచియూ నశించె
 ఇది పిశాచులతో నిటాలేక్షణుండు 
గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు 
ఇది మరణచూడ తీక్షణమౌ దృష్టం లొలయ
నవనిఁ బావించు భస్మ సింహాసనంబు

భావం: ఈ ముద్రభూమికి చెడ్డవాడు మంచివాడనే తేడాలేదు. యజమాని, సేవకుడనే భేదం లేదు. ఈ నేలలో కవి, రాజు, ఇల్లాలి మాంగల్యం, చిత్రకారుడు ఎవరైతేనేమీ ఆయుష్షు తీరాక ఇక్కడికి చేరుకోవాల్సించే . సృష్టికి లయకారుడు శివుడు ఆయనకు ఇష్టమైనది తాండవం ఆ శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటికకు మించి ఏమున్నది? ఈ వాటిక. శివుడు తన పిశాచ అనుచరగణంతో నాట్యమాడు రంగస్థలం. ఈ రుద్రభూమి మరబదూతే భూమిని పాలించు బూడిదతో చేసిన సింహాసనమట!