మయూఖ థ్రిల్ చేస్తుంది  

మయూఖ థ్రిల్ చేస్తుంది  

పాయల్ చెంగప్ప లీడ్ రోల్‌‌లో నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ ‘మయూఖ’. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ ‘ఈ కథ వింటున్నంత సేపూ థ్రిల్ ఫీల్ కలిగింది.  ఓ అమ్మాయి  అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది గూస్ బంప్స్ తెప్పించింది. 

ఈ సినిమా అందరికీ కొత్త ఫీల్ కలిగిస్తుంది’ అని  చెప్పింది. డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్ . కె. మాట్లాడుతూ ‘ఇలాంటి చిత్రాలు తెలుగులో అరుదుగా వస్తాయి.  హాలీవుడ్, కొరియన్ మూవీ తరహాలో కలర్ గ్రేడింగ్ చేశాం.  కచ్చితంగా  సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌‌పీరియన్స్ ఇస్తాం’ అని చెప్పాడు. 

చక్కని కంటెంట్‌‌తో దసరాకు రాబోతున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని  నిర్మాత శశిధర్ అన్నారు.  నటీనటులు అభిలాష్ అడ్డ,  దేవ్ డి, రఘు వాసిరెడ్డి,   నానానీ కర్రి, మాస్టర్ షణ్ముఖ చరణ్,  బేబి మది నస్రీన్  పాల్గొన్నారు.