గాంధీ జయంతికి తత్వం మూవీ రిలీజ్...

గాంధీ జయంతికి తత్వం మూవీ రిలీజ్...

హీరో దినేష్ తేజ్‌‌, దష్విక.కె జంటగా అర్జున్‌‌ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తత్వం’. శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటి నిర్మించారు.  అక్టోబర్‌‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌‌ దష్విక మాట్లాడుతూ ‘మాది వైజాగ్. గతంలో  విజయ్‌‌ దేవరకొండతో కలిసి ఓ యాడ్‌‌లో నటించా.  

ఈ  సినిమాతో  హీరోయిన్‌‌గా పరిచయం కావడం లక్కీగా ఫీలవుతున్నా.  నా  పాత్రలో గ్రే షేడ్స్‌‌ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. విలేజ్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే ఈ మర్డర్‌‌ మిస్టరీలో సస్పెన్స్‌‌, ఎమోషన్‌‌ ఆకట్టుకుంటాయి.  

దినేష్‌‌ తేజ్‌‌ ఎంతో సపోర్ట్‌‌ చేశారు.  దర్శకుడు అర్జున్‌‌ కోలాకు మంచి క్లారిటీ ఉంది. ఈ చిత్రంలోని  కథ, కథనాలతో పాటు చేతన్ భరద్వాజ్‌‌ సంగీతం, ఆర్‌‌ఆర్‌‌ హైలైట్‌‌గా ఉంటుంది.  ఇక  నటనకు ఆస్కారమున్న పాత్రలు, ముఖ్యంగా లవ్‌‌స్టోరీస్‌‌లో నటించాలని ఉంది.