భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ ఏడాది (2026) మహాయలపక్షాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు ..ఈ పక్షం రోజులు ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు కాలం చేశారో ఆ రోజు.. శ్రాద్ధం నిర్వర్తించాలని పండితులు చెబుతున్నారు. లేదంటే అమావాస్య రోజు( అక్టోబర్ 10)న నిర్వహించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.
పురాణాల ప్రకారం.. బాధ్రపదమాసం కృష్ణపక్షం 15 రోజును మహాలయపక్షం అంటారు. ఈ 15 రోజులు పితృదేవతలు భూమిపై సంచరిస్తారని పండితులు చెబుతున్నారు. వారిని సంతృప్తి పరిచేందుంకు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం ప్రతి మనిషి కూడా మూడు రకాలు రుణాలు కలిగి ఉంటాడు. 1. దేవతల రుణం.. 2. రుషుల రుణం.. 3 పితృరుణం.
దేవతలను అర్చించడం.. దేవాలయాలను దర్శించడం ద్వారా దేవతల రుణం తీరుతుంది. వ్రతాలు.. పూజలు.. చేయడం .. ఆరోజు రుషులను తలచుకొని వారికి నైవేద్యాలు సమర్పించడం వలన రుషుల రుణం తీరుతుంది.
ఇక పితృదేవతల రుణం విషయానికొస్తే .. మన పూర్వీకులైన పితృల ఋణం. వీటిలో పితృ ఋణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే పితృపక్షం... భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు ( అక్టోబర్ 10 వరకు) ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తాం. ఈ 15 రోజులు పెద్దలకు ప్రీతిపాత్రమైనవి. ఈ ఏడాది మహాలయ పక్షాలు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 10వ తేదీ వరకు ఉన్నాయి.
మహాలయపక్షాల సమయంలో ఈ 15 రోజులు పితృదేవతలు భూలోకంలో సంచరిస్తారు. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించుకుంటూ.. వారికి నమస్కారము చేయాలి. నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు వదలాలి. కనుక ఎలాంటి శుభకార్యాలు చేయరు..పితృదేవతలను తలుచుకుంటారు...
తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (అక్టోబర్ 10 న) నైనా చేసి తీరాలి.
హిందువుల నమ్మకాల ప్రకారం, అరచేతిలో బొటనవేలు ఉన్న భాగాన్ని పితృ తీర్థం అంటారు. తర్పణ పదార్థాలను తీసుకున్న తర్వాత దక్షిణ దిశలో కూర్చోవాలి. పూర్వీకులకు బొటన వేలి నుంచి నీటిని తర్పణం వదలాలి. ఇలా పూర్వీకులకు సమర్పిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు.
పురాణాలప్రకారం, బొటనవేలు ఉన్న అరచేతి భాగాన్ని పితృ తీర్థం అంటారు. కర్తలు ( తర్పణం విడిచేవారు) తమ చేతులలో నీరు, కుశ (దర్భ) , అక్షత, పుష్పాలు మరియు నల్ల నువ్వులు తీసుకోవాలి. పూర్వీకులను ధ్యానం చేసుకుంటూ దాహం తీర్చుకోండి అంటూ నీటిని వదలాలి.
తూర్పు ముఖంగా పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారని వివరించారు. ఋషి తీర్థంలో .. ఉత్తర ముఖంగా పూర్వీకులకు నీరు మరియు అక్షతలను సమర్పించాలి. పూర్వీకులకు దక్షిణ ముఖంగా నీరు, నువ్వులు సమర్పిస్తారు. . మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలంటే మహాలయ పక్షాల్లో తర్పణాలు విడవాలంటున్నారు.
గంగా జలం ఉంటే దానితో తర్పణాలు వదిలితే చాలా పవిత్రత ఉంటుందని చెపుతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మంలో గంగా నదికి ఎంతో పవిత్రత ఉంది. పూర్వీకులకు సమర్పించే గంగాజలంలో ఆహారం కలిపి నైవైద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదిస్తారని నమ్ముతారు. పితృ పక్ష కాలంలో ఇంటి చుట్టూ గంగాజలం కూడా క్రమం తప్పకుండా చల్లాలని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
