హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వంలో సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల నిర్మిస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ రివీల్ గ్లింప్స్‌ను.. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ గ్లింప్స్‌లో ఓ అమ్మాయిని చంపేందుకు హీరో గన్ కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి కథ మోడ్రన్ రిలేషన్స్ చుట్టూ తిరిగే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతను టార్గెట్ చేస్తూ.. వాళ్లకు తెలిసిన భాష, రిలేషన్‌షిప్ డైనమిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
